మై గాడ్ .. జాగ్వార్ రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా ?

Wednesday, September 21st, 2016, 12:33:30 PM IST

jaquar
మాజీ ప్రధానమంత్రి దేవా గౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ”జాగ్వార్” సినిమా ఇటీవలే ఆడియో విడుదల చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ అందరికి షాక్ ఇస్తున్నాయి. ట్రైలర్ లో ఈ సినిమాకు ఎంత భారీగా ఖర్చు పెట్టారో అర్థం అవుతుంది. ఈ సినిమాకు బడ్జెట్ ఎంతో తెలుసా 75 కోట్లు … ఓ కమర్షియల్ సినిమాకు ఇంత భారీ బడ్జెట్ అవసరమా అనే ప్రశ్న కలుగుతుంది. ఎంత మాజీ ప్రధాన మంత్రి మనవడు అయితే ఓ న్యూ హీరోకి ఇంత గ్రాండ్ లాంచా !! అది పక్కన పెడితే ఈ సినిమాకు పనిచేస్తున్న వారికి భారీ రెమ్యూనరేషన్స్ దక్కినట్టు సమాచారం? సౌత్ ఇండియాలోనే భారీ డెబ్యూట్ సినిమా ఇదే. ఇక ఈ సినిమాకు ”మిత్రుడు” ఫేమ్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఒక్క రచయితకే ఏకంగా డెబ్భై లక్షలు ఇచ్చారట !! ఇక హీరోయిన్ కు కూడా రెండు కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. టాప్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న తమన్నా, శృతి, నయనతార లాంటి వారికే అంత పారితోషికం లేదు ? అలాగే మిగితా నటీనటులు, టెక్నీషియన్స్ కు కూడా భారీగానే అందాయట !! మొత్తానికి జాగ్వార్ సినిమాతో వీరందరికి పండగే అన్నమాట !! అన్నట్టు ఈ సినిమా దసరాకు విడుదల అవుతుంది.