దియా జాలో కి దేశ ప్రజల నుండి అశేష స్పందన

Sunday, April 5th, 2020, 09:58:24 PM IST

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనా పై పోరుకు యావత్ భారతావని ఒక్కటైంది. దేశ సమైక్యతను చాటుతూ దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుండి 09:09 నిమిషాల వరకు దీపాలతో దేశం కళకళ లాడింది.దియా జాలో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కొనసాగించారు. దేశం దీపాల వెలుగుల తో నిండిపోయింది. ఇళ్లలో లైట్లు అర్పేసి, కొవ్వొత్తులు, దీపాల, టార్చ్ లైట్ వెలుతురు లో కరోనా మహమ్మారి పై నిర్మూలనకు ప్రతిన చేశారు. అయితే ఈ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో ప్రజలతో పాటుగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అందరూ ఈ కార్యక్రమం లో భాగం పంచుకున్నారు.