రాజశేఖర్ కల్కి కోసం భారీ సెట్స్ ?

Tuesday, September 18th, 2018, 10:24:47 AM IST

ప్రముఖ నటుడు రాజా శేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే కల్కి సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. రేపటి నుండి అక్కడ షూటింగ్ మొదలు పెడతారట. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న రాజశేఖర్ కు గరుడ వేగా సినిమా మళ్ళీ ఫామ్ లోకి తెచ్చింది. ఇక కల్కి సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కనుంది. అ ! సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.