డే-2..అజ్ఞాతవాసి బయ్యర్లకు మైండ్ బ్లాక్..!

Friday, January 12th, 2018, 03:50:35 AM IST

పవన్ క్రేజ్ తో అజ్ఞాతవాసి చిత్రానికి తొలిరోజు రికార్డు కలెక్షన్ లు అయితే వచ్చాయి కానీ.. రెండవరోజు నుంచి అగ్ని పరీక్ష మొదలైంది. సినిమాలో విషయం లేకపోవడంతో రెండవ రోజు నుంచే కలెక్షన్లు పూర్తిగా డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. కనీసం పండగ రోజులు మొదలయ్యాక కూడా పరిస్థితి మెరుగు పడక పోతే బయ్యర్లు సగానికి సంగం నష్టాలని చవిచూడాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.

అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందు మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ ఉండింది. కానీ సినిమా చూశాక త్రివిక్రమ్ డైరెక్షన్ అందరిని షాక్ కి గురిచేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంతో కంప్లైట్ గా ట్రాక్ తప్పదనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ చిత్రానికి 120 కోట్లకు పైగా భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో కనీసం 75 శాతమైనా రికవరీ కావడం గగనంగా కనిపిస్తోంది. కొన్ని ఏరియాలలో మినహా మిగిలిన ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు 50 శాతం నష్టాలని చవిచూడాల్సిన పరిస్థితి రావొచ్చంటూ అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణంగా పండగ మూడు రోజులు సినిమాలకు కలెక్షన్లు బావుంటాయి. ఫ్యామిలీ మొత్తం పండుగ దినాల్లో సినిమా చూసేందుకు ఇష్టపడుతారు కావున అప్పుడైనా అజ్ఞాతవాసి పరిస్థితి కొంత మెరుగుపడుతుందని బయ్యర్లు ఆశతో ఉన్నారు. అది జరిగితే నష్టం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. ఓవైపు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయిన మాత్ టాక్, రేపు విడుదల కానున్న బాలయ్య, సూర్య చిత్రాలని తట్టుకుని ఏమేరకు అజ్ఞాతవాసి వసూళ్లు సాధిస్తుందో అనేది ప్రశ్నార్థకమే..!!