హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మళ్లీ పెరిగిన రద్దీ…ఒక్కరోజులోనే భారీగా రాకపోకలు!

Friday, May 22nd, 2020, 07:35:21 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షల సడలింపు లలో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వినియోగంలోకి వచ్చింది. అయితే ఎన్నో లాక్ డౌన్ కారణాల వలన ఎక్కడి వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. లాక్ డౌన్ ను సడలించడం తో వాహనాల రాకపోకలు భారీగా పెరగడమే కాకుండా, అక్కడ రద్దీ కూడా పెరిగింది.అయితే బుధవారం అర్దరాత్రి నుండి గురువారం అర్థరాత్రి వరకు కేవలం 24 గంటల్లో 44,220 వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద రాకపోకలు జరిగాయి.

అయితే లాక్ డౌన్ సడలింపు ల ద్వారా హైదరాబాద్ లో ట్రాఫిక్ మళ్లీ పెరిగి పోతుంది. ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పై ఆందోళన చెందుతున్న సమయంలో ఎలాంటి పరిస్తితులు ఎదురౌతాయి అనే దాని పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుంది.అయితే కరోనా పరీక్షల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. హైదరాబాద్ లోనే ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మరి కొన్ని అంశాల పై ప్రభుత్వం దృష్టి సారించనుందీ.