నమ్ముకున్న మీడియానే నిండా ముంచిందా శ్రీ రెడ్డి..!

Wednesday, April 18th, 2018, 01:10:12 PM IST

ఇన్నాళ్ళు ఏ మీడియాని నమ్ముకొని ఇటు చలన చోఇత్ర పరిశ్రమపై, అటు సవ్య సమాజంపై రంకెలేస్తూ ఎగిరిపడిన శ్రీ రెడ్డి కథ ఇప్పుడు ఒక్కసారిగా నేల కూలింది. తన బలం బలహీనతలు చూసుకోకుండా విరుచుకుపడి టీవీ చానెళ్లు అవి ప్రతీ క్షణం తపన పడే టీఆర్పీ కోసం తనకు ఇస్తున్న ప్రయారిటీ వెనుక వున్న అసలు నిజం ఏమయివుంటుందో తెలుసుకోకుండా, అసలు తప్పులు అన్నీ తాను చేసి, సాక్షి చానెల్ లో పనిచేసిన నాటి నుంచి ఇప్పటి వరకు వున్న తన మీడియా, సినీ ప్రస్థానంలో తన తప్పులు అనేకం పెట్టుకుని కూడా శ్రీరెడ్డి ఏదో పొడిచేద్దామని అనుకుని, నలుగురిలో నవ్వులపాలు అయి, ఇంకేమీ చేయలేక, ఆఖరికి నీ వేవంట మేమున్నాం అని చెప్పిన చానెల్ లోనే ఆరుగురి మధ్య పాయింట్ అవుట్ అయిపోయి, ప్రముఖ మానవతావాది బాబు గోగినేని చేతిలో చిత్తూ చిత్తుగా క్లాస్ పీకించేసుకుని, వలవలా ఏడిచి, తాను ఓడిపోయాను అని చెప్పాల్సిన కర్మ పట్టింది.

శ్రీరెడ్డిఉద్యమం అంటూ ప్రజల్లోకి వచ్చిన మొదటి రోజునుండి ఏమని మాట్లాడిందో, ప్రతీ విషయాన్ని గుర్తు చేస్తూ తన బిహేవియర్ ను, వ్యభిచారాన్ని బ్యాన్ చేస్తే ఎలా బతకాలన్న మాటలను, సెల్ఫీలు పట్టుకుని చీటింగ్ చేసారని అనడాన్ని, ఇలా ప్రతి ఒక్కదాన్ని పాయింట్ అవుట్ చేస్తూ, అరడజను మంది ముందు నిలదీసేసరికి శ్రీరెడ్డికి నోట మాటరాలేదు. కంట కన్నీళ్లు తప్ప. చివరికి ఆమె ఏడుస్తున్న విధానాన్ని కూడా బాబు గోగినేని తప్పు పట్టారు. ఆమె ఏడుస్తున్నప్పుడు కెమరాలు అటు తిప్పోద్దని, అవన్నీ దొంగ ఏడ్పులని అలాంటి కన్నీళ్లను నమ్మలేమన్నట్లుగా ఉన్నాయని బాబు గోగినేని కరాఖండిగా చేచి చెప్పారు. శ్రీ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా ఏమి ఉపయోగం ఉండదని, ప్రస్తుతం చానెళ్ళు తమ టీఆర్పీ రెట్లు పెంచుకోవడానికి ఆమెను ఒక తోలు బొమ్మలా వాడుకుంటున్నారే తప్ప ఇంకేమి ఉపయోగం లేదని అన్నారు.

ఆమె ప్రవర్తన చూస్తుంటే కొంచం తేడాగా కనిపిస్తుందని, ఎందుకైనా మంచిది ఆమెను కొంచం సైకియాట్రిస్టుకు చూపించడం మంచిదని కూడా సలహా ఇచ్చారు. మొత్తం మీద చానెళ్లు తమ టీఆర్పీ గోల్ తాము సాధించేసాక, ఇక శ్రీరెడ్డిని ఎవరూ పట్టించుకోరని అది ఇప్పటికైనా తెలుసుకొని అసులుకోవడం మంచిదని అన్నారు. కానీ ఇది వికటిస్తోందని గమనించాక, చాలా తెలివిగా, కాగల కార్యం గంధర్వులు తీర్చేసినట్లుగా, అదే చానెల్ లో, అదే డిస్కషన్లొ, వక్తల ద్వారానే ఫుల్ స్టాప్ పెట్టించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పాపం, శ్రీరెడ్డి, తనే తెలివైనది అనుకుంది. తన కన్నా బలమైన వ్యవస్థలు వున్నాయని, సమాజంలో తనకంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయని ఇవన్నీ మూన్నాళ్ళ ముచ్చట్లేనని తెలుసుకోలేకపోయిందని అన్నారు. ఏ విషయం పైన ఉద్యమం చేయాలి, అసలు తనేం చెయ్యాలి అనుకుంది, ఇప్పుడేం జరుగుతుంది. సమస్య ఎక్కడికి వెళ్ళింది అన్న ఏ విషయంపై కూడా క్లారిటీ లేకుండా అనవసర డ్రామాలు చేస్తుంది అని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments