వంట చేయట్లేదని విడాకులడిగితే తన్ని తరిమేసిన హైకోర్ట్…!

Saturday, March 3rd, 2018, 12:31:06 PM IST

ఈ మధ్య కాలంలో విడాకుల తీస్కోవడం అంటే ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చినంత ఈజీగా అయిపోతుంది అనుకున్నాడో ఏమో, ముంబాయిలో ఓ భర్త. తన భార్య ఉదయాన్నే నిద్రలేవడంలేదు.. ఇంటి పనులు కుడా సక్రమంగా చేయడం లేదు.. ఆవిడ దగ్గర నుంచి నాకు విడాకుల ఇప్పించండి అంటూ బొంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అతను చేసిన పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ కేకే.టటేడ్‌, జస్టిస్‌ సరంగ్‌ కొత్వాల్‌ భర్తకు కోర్టులోనే మరోసారి అక్షింతలు వేశారు. ఆఫీస్‌కు వెళ్లి ఉద్యోగం చేసి వస్తున్న భార్యకు చేదోడువాదోడుగా పక్కనుండి సహాయంగా ఉండాల్సిందిపోయి విడాకులు కోరతావా అంటూ న్యాయస్థానం అతడిని తనని తరిమేసింది.

ముంబయిలోని శాంతాక్రూజ్‌ ప్రాంతంలో నివసించే ఈ మొనగాడు, ‘సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆమె ఆఫీస్‌ నుంచి వస్తుంది, కాసేపు నిద్రపోతుంది. రాత్రి 8.30 అయ్యేంత వరకు ఆమె వంట ప్రారంభించదు. మాకు సరిపడా ఆహారం వండటం లేదు, ఆమె చేస్తున్న వంట కూడా ఆహా అనిపించేలా లేదని అతడికి, అతడి తల్లిదండ్రులకు సక్రమంగా వంట వండి పెట్టడం లేదని, ఆరోపిస్తూ విడాకులు ఇప్పించాల్సిందిగా ముంబాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి, నేను ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తే కనీసం ఓ గ్లాస్‌ మంచినీళ్లు కూడా ఇవ్వదు’ అంటూ అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. భర్త చేస్తున్న ఆరోపణలకు ఆయన తండ్రి కూడా వత్తాసు పలికాడు.

ఈ ఆరోపణలన్నింటినీ ఆమె మాత్రం ఖండించింది. ఆఫీస్‌కు వెళ్లే ముందే కుటుంబం మొత్తానికి సరిపడా వంట చేస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆమె చుట్టుపక్కన ఇండ్ల వాళ్ళు కుడా భార్యకే మద్దతు ఇచ్చారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నానని ఇంటిల్లిపాదికీఎలాంటి లోటు లేకుండా చూస్కుంటున్నానని, ఆమె న్యాయస్థానానికి తెలిపింది. దీనికి సంబంధించి తగిన సాక్ష్యాలను కూడా చూపించింది. కానీ భర్త, అత్తమామలు తనను చిన్నచూపు చూస్తున్నారని భర్తకు ఒక భార్యలా, అత్తా మామలకు ఒక కోడలిలాకాకపోయినా కనీసం ఒక ఆడదానిలా కుడా చూచుదటంలేదని, ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

‘భార్య ఇంటి పనితో పాటు ఆఫీస్‌కు వెళ్లి ఉద్యోగం చేసి వస్తుందనే విషయాన్ని ఆలోచించాలి. ఆమె ఆఫీస్‌ నుంచి వచ్చేప్పుడే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకువస్తోంది. ఎంత పని ఉన్నా ఆరోగ్యం ఎలా ఉన్నా కుటుంబసభ్యుల కోసం ఉదయం, సాయంత్రం కష్టపడుతూ అన్ని ఇంటి పనులూ చక్కబెడుతుంది. అంతలా ఇంటి పనులు చేసుకుంటున్న ఆమెపై భర్త ఇంటికి వచ్చినపుడు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించడం సరైనది కాదు. అంటూ పిటిషనరైన భర్తను కోర్టు తన్ని తరిమేసి. విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments