మూడేళ్లు కాపురం చేశాక తెలిసింది.. ఆ విషయం..!

Wednesday, February 8th, 2017, 08:00:27 PM IST


తాను మోసపోయానన్నవిషయం తన భార్యతో మూడేళ్లు కాపురం చేశాక కానీ తెలియలేదు. అహ్మదాబాద్ కు చెందిన రాజుభాయ్ అనే వ్యక్తి 2013 లో మాట్రిమోనియల్ సైట్ చూసి పింకీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.వారికి ఒక బాబు కూడా పుట్టి వారి కాపురం అన్యోన్యంగా సాగుతున్న సమయంలో అతనికి తన భార్య గురించి జీర్ణించుకోలేని నిజం తెలుసుకున్నాడు. తన భార్యకు ఇదివరకటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె దాచి తనని వివాహం చేసుకుంది.తన గత జీవితం గురించి తన భార్య ఫోన్ లో మాట్లాడుతుండగా అతడు చూసాడు. గత జీవితం గురించి నిజాలు చెప్పాల్సిందా నిలదీసాడు. ఈక్రమం లో ఆమెకు రెండు సార్లు వివాహం జరిగిందని తెలుసుకున్నాడు. ఆమె తన రెండో భర్తకు కనీసం విడాకులు కూడా ఇవ్వకుండా తనని పెళ్లి చేసుకుందని వాపోయాడు.

ఈ వ్యవహారం ఇద్దరిమధ్య గొడవకు దారి తీసింది. దీనితో ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాదు అతడికి మరో షాక్ ఇచ్చింది. తనకు ఆస్తి,డబ్బు కావాలని లేదంటే కొడుకుని చంపేస్తానని కూడా బెదిరిస్తోంది. దీనితో అతడు పోలీస్ లనుఆ ఆశ్రయించాడు. పోలీస్ లు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.