భార్యకు కరోనా పాజిటివ్ – అనుమానంతో తన వాహనాన్ని తగలబెట్టిన భర్త…?

Thursday, May 21st, 2020, 11:53:03 AM IST

చాలా రోజుల నుండి మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రజలందరుకూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ విఱుస్కారణంగా ప్రజల్లో కొత్త కొత్త అనుమానాలు కూడా మొదలవుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా కరోనా కి భయపడి, సొంత కుటుంబ సభ్యులే విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో బాధితులు తీవ్రమైన ఆందోళనకు లోనవుతున్నారు. కాగా కరోనా రోగులపై వివక్ష చూపకూడదని మన ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కూడా కొందరిలో మాత్రం మార్పు అనేదే రావడం లేదని చెప్పాలి. అంతేకాకుండా కొందరు దారుణంగా మానవత్వాన్ని మరిచిపోయి, కర్కశంగా తయారవుతున్నారు.

కాగా తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి, తన భార్యకు కరోనా సోకిందని రెచ్చిపోయాడు. లంగర్ హౌజ్‌లోని బాపునగర్‌లో స్థానికంగా నివాసముంటున్నటువంటి ఓ మహిళకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను అధికారులు ఆస్పత్రికి తరలించి, ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళా భర్త ఈ తీవ్రమైన ఆవేశానికి లోనై పిచ్చిగా ప్రవర్తించాడు. తరువాత మద్యం సేవించి వచ్చి, అదే మత్తులో ఇంటి సమీపంలోని రెండు బైకులు, ఒక ఆటోకు నిప్పుపెట్టారు. కాగా స్థానికుల సహాయంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆ వ్యక్తి ప్రవర్తనతో స్థానికులందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.