హుజుర్ నగర్ ఉపఎన్నిక : కాంగ్రెస్ ని దెబ్బకొడుతున్న తెరాస… ఎలాగంటే…?

Wednesday, October 9th, 2019, 10:19:24 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఉపఎన్నిక జరగనున్నసంగతి మనకు తెలిసిందే. కాగా ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీ మాత్రం అధికార తెరాస మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ల మధ్యనే ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ నెల 21న జరగబోయే ఉపఎన్నికకు ఈ పార్టీలన్నీ కూడా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. అయితే అంతలోనే ఒక ఊహించని సంఘటన ఎదురైందని చెప్పాలి. ప్రస్తుతానికి హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి కొందరు ప్రధాన కార్యకర్తలు బుధవారం నాడు తెరాస పార్టీ లో చేరిపోయారు. కాగా తెరాస రాష్ట్ర కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ సమక్షంలో వారు చేరిపోయారు.

ఈమేరకు వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యి తెరాస లో చేరిపోడానికి సిద్ధమయ్యామని చెబుతున్నారు. అంతేకాకుండా తెరాస పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపుకు అహర్నిశలు కృషి చేస్తామని, తప్పకుండ తెరాస గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించే పనిలో తెరాస నేతలు బిజీ గా గడుపుతున్నారని సమాచారం. ఎలాగోలా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి హుజుర్ నగర్ లో తెరాస జెండా ఎగరేయడానికి తెరాస నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.