హుజూర్ నగర్ ఉపఎన్నిక : తెరాస తో మద్దతుపై మరొకసారి ఆలోచిస్తాం – సిపిఐ నేత

Thursday, October 10th, 2019, 02:30:14 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ లో మరికొద్ది రోజుల్లో ఉపఎన్నిక జరగనుంది. కాగా ఈ ఉపఎన్నికని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి… గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కి కంచుకోటగా మారినటువంటి హుజుర్ నగర్ లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ ని ఓడించి అక్కడ తెరాస జెండా ఎగరేయాలని తెరాస నేతలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమేరకు తెరాస పార్టీ ఉపఎన్నిక కోసమని సిపిఐ పార్టీ తో పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సిపిఐ పార్టీ నేత తెరాస కి షాక్ ఇవ్వనున్నారని సమాచారం.

అయితే సిపిఐ పార్టీ తెరాస కి మద్దతిస్తానని ప్రకటించింది. కానీ ఈ మద్దతు విషయంలో సిపిఐ పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. తెలంగాణలో గత వరం రోజులుగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన సమ్మె చేస్తున్నారు. కాగా ఆ ఆర్టీసీ కార్మికులకు సిపిఐ మద్దతు ప్రకటించింది. అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో తెరాస ప్రభుత్వం తమ నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకోకపోతే, ఉపఎన్నిక విషయంలో తెరాస కి మద్దతు పై పునరాలోచిస్తామని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.