విశ్లేషణ : హుజుర్ నగర్ ఉపఎన్నిక : ఉపపోరులో ఎగిరే జెండా ఎవరిదీ…?

Friday, October 18th, 2019, 07:18:21 AM IST

తెలంగాణ రాష్ట్రంలోమరికొద్ది గంటల్లో ఉపఎన్నిక జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉపఎన్నికని తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆత్మగౌరవ సమస్యగా పరిగణించుకున్నాయి. కాగా ఎలాగైనా సరే ఈ ఉపఎన్నికలో తమ జెండా ఎగరేసి తమ పార్టీ సత్తా చాటడానికి రాష్ట్ర రాజకీయ పార్టీలన్ని కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నికలో పోటీదారులుగా తెరాస, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ లు పాల్గొంటున్నప్పటికీ కూడా వీరిలో ప్రధాన పోటీ మాత్రం అధికార తెరాస మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ మధ్యన ఉంటుందని స్పష్టంగా అర్థమవుతుంది. కాగా గత కొద్దీ సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారినటువంటి హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ని దారుణంగా ఓడించి ఎలాగైనా సరే హుజుర్ నగర్ కోట మీద తెరాస జెండా ఎగరేయాలని అధికార తెరాస పార్టీ, తమ ప్రయత్నాలను తీవ్రతరం చేశాయి. అలాగే ఎప్పటిలాగే ఈ ఉపఎన్నికలో కూడా విజయం తమ కాంగ్రెస్ పార్టీదే అని, తమ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరని కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా భరోసాగా ఉన్నారు.

కాగా తెలంగాణ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే గా గెలిచినటువంటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణాలో ఆతరువాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా కూడా విజయం సాధించారు. అయితే ఈమేరకు ఉత్తమ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వలన అక్కడ ప్రస్తుతానికి ఉపఎన్నిక జరగనుంది… కాగా ఇప్పుడు హుజుర్ నగర్ లో జరిగే ఉపఎన్నికలో ఇక్కడ అధికార తెరాస పార్టీ తరపున సైది రెడ్డి, కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి, సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖరరావు, తీన్మార్ మల్లన్న వంటి వారు ముఖ్యంగా బరిలో ఉన్నారు. అందరు కూడా మంచి పట్టు ఉన్నటువంటి నాయకులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రాజాతీర్పు ఎవరికీ అనుకూలంగా వస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో పోరాటాల మధ్యన సాదించుకొని కొత్త రాష్ట్రంలో తమ పార్టీ జెండా ఎగరేసి తమ ప్రభుత్వాన్ని నిలుపుకుంది తెరాస పార్టీ. కాగా అప్పటినుండి ఇప్పటికి అంటే 2014 లో జరిగిన ఎన్నికల్లో మరియు గత ఏడాది 2018 లో జరిగినటువంటి ఎన్నికల్లో తెరాస పార్టీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. తెరాస పార్టీ సృష్టించిన ప్రభంజనం ముందు మిగతా పార్టీలన్నీ చతికిలపడిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి అఖండమైన మెజారిటీ ని నమోదు చేసుకొని మరీ తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎదురే లేదని నిరూపించుకొని, వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకుంది తెరాస పార్టీ. ఇక అదే జోరులో ఈ ఉపఎన్నికలో కూడా తమ సత్తా మరొకసారి నిరూపించుకోడానికి తెరాస పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కానీ ఈసారి తెరాస పార్టీ విజయం సాధించడం అనేది ఎందుకో అనుమానాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం తో జరిపిన చర్చలు విఫలం అవడంతో, ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెని ఉదృతం చేశారు. కాగా ఈ విషయంలో ఆగ్రహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ విధించి వారి ఉద్యోగాలను తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన ఆర్టీసీ కార్మికులలో ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే వారి ప్రాణాలు పోయినప్పటికీ కూడా సీఎం కెసిఆర్ వెనక్కి తగ్గకపోవడంతో ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆర్టీసీ కి మద్దతు తెలుపుతు, వారి సమ్మెని కొనసాగిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజలందరూ కూడా సీఎం కెసిఆర్ ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల్ని వాడుకొని ఇప్పుడు అవసరం తీరిపోయాక సీఎం కెసిఆర్ వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దెబ్బ ఉపఎన్నికలో చాలా స్పష్టంగా కనబడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఇదే కాకా ప్రస్తుతానికి అధికార పార్టీ తరపున బరిలోకి దిగుతున్నటువంటి సైదిరెడ్డి పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కానీ ఆయనకు ఇక్కడ చాలా పలుకుబడి ఉన్నప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయి, ఉపఎన్నికలో ఓటమిపాలవుతాడని అంచనా. ఏదేమైనప్పటికీ కూడా ఈ హుజుర్ నగర్ ఉపఎన్నికలో విలయం సాధించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు తెరాస నేతలు. అయితే ఒకవేళ ఈ ఉపఎన్నికలో గనక తెరాస పార్టీ ఓడిపోతే మాత్రం ఈ దెబ్బ అనేది తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నిలకపై పడనుందని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ఈ విజయం అనేది తెరాస పార్టీ కి అత్యవసరం అని చెప్పాలి.

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా కూడా హుజుర్ నగర్ లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కి పట్టం కడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద అక్కడి ప్రజలందరికి నమ్మకం ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాదించినటువంటి టీపీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి గారి భార్య పద్మావతిరెడ్డి ఈసారి బరిలోకి దిగుతున్నారు. కాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే వరుసగా 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ తరపున మొదట్లో కోదాడ లో, ఆ తరువాత హుజుర్ నగర్ లో విజయం సాధించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. కానీ పద్మావతి రెడ్డి గారు గత ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ గత కొన్ని ఏళ్లుగా అక్కడి ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీదున్న నమ్మకంతోనైనా ఈసారి కూడా హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి కూడా ఎలాగైనా విజయం సాదించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

అయితే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా జేఏసీ పార్టీ కూడా ముందుకు వచ్చింది. కాగా కాంగ్రెస్ పార్టీ లో ఫైర్ బాంబ్ గా పేరు తెచుకున్నటువంటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. కానీ ఎన్నికకు సమయం దగ్గర పడటంతో రేవంత్ రెడ్డి ప్రచారం జరగదేమో అని అనుమానం వ్యక్తం అవుతుంది. దానికి తోడు కాంగ్రెస్ కీలకనేతలు కోమటిరెడ్డి సోదరులు గతంలోకాంగ్రెస్ పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ కూడా, ఆ తరువాత తమ చివరి శ్వాశ వరకు కాంగ్రెస్ లో కొనసాగుతామని మాటిచ్చి, ఉపఎన్నికలో తమవంతు కృషి చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ విజయం అనేది పరువు సమస్యగా మారింది. ఒకవేళ గనక ఈ ఉపఎన్నికలో తన భార్య పద్మావతి రెడ్డి ఓడిపోతే, ఉత్తమ్ ని టీపీసీసీ చీఫ్ పదవి నుండి తొలగించే అవకాశం ఉందని ఇప్పటికే అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం.

ఇక మిగిలిన టీడీపీ మరియు బీజేపీ లు కూడా తమ విజయం కోసమని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే తెలంగాణాలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్తానం తో సరిపెట్టుకున్న బీజేపీ పార్టీ, ఆతరువాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 4 కీలకమైన స్థానాలను సొంతం చేసుకుంది. కాగా బీజేపీ పార్టీ తరపున కోట రామారావు బరిలోకి దిగనున్నారు. అయితే ప్రజల నాడి గట్టిగా తెలుసుకున్నటువంటి కోట రామారావు విజయం సాధిస్తానని, కుదరకపోతే కనీసం రెండవ స్థానంలోనైనా ఉంటానని బలంగా చెబుతున్నారు. కాగా వరుసగా రెండవసారి కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్నటువంటి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో కూడా బలోపేతం కావడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. అయితే అలా తెలంగాణ రాష్ట్రంలో బలిలోపేతం కావాలంటే మాత్రం బీజేపీ కి ఈ ఉపఎన్నికలో విజయం సాధించడం అనేది ముఖ్యం అని చెప్పాలి.

కాగా ఇక చివరగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తో కలిసి పొత్తుతో బరిలోకి దిగినటువంటి టీడీపీ పార్టీ, ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈమేరకు చావా కిరణ్మయి అనే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. కాగా ఈ హుజుర్ నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో పాటు సుహాసిని కూడా ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి కానీ కొన్ని అనివార్య కారణాల వలన అది కుదరలేదు. అయితే ఏపీలో ప్రస్తుతానికి కష్టకాలంలో కొట్టుకుంటున్నటువంటి టీడీపీ పార్టీ కి ఈ విజయం కూడా అత్యంత ఆవశ్యకం అని తెలుస్తుంది. ఈమేరకు వీరు కూడా తమదైన రీతిలో కష్టపడుతున్నారు.

కాగా ఈ ఎన్నికల బరిలో స్వాతంత్ర్య అభ్యర్థులుగా తీన్మార్ మల్లన్నతో పాటు మరికొందరు కూడా బరిలోకి దిగుతున్నారు. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. కానీ అధికార ప్రతిపక్ష పార్టీ ల మధ్యన తట్టుకొని ఎలా నిలబడతాడనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నగా మిగిలిపొయింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే ఇక్కడ కేవలం తెరాస, కాంగ్రెస్ ల మధ్య బలమైన పోటీ కనిపిస్తుంది. కానీ ఈ ఉపపోరులో హుజుర్ నగర్ నియోజక వర్గ ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో చూడాలి మరి. ఇకపోతే ఈ హుజుర్ నగర్ ఉపఎన్నిక ఈనెల 21 న జరగగా, దాని ఫలితం మాత్రం 24 న వెలువడనుంది. ఈ ఎన్నికలో గెలుపే వారి రాజకీయ భవిష్యత్తుని నిర్ణయిస్తామని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ పోరులో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.