హుజూర్ నగర్ ఉపఎన్నిక : ఇక్కడ గెలవబోయేది పార్టీ ఏది…?

Wednesday, October 16th, 2019, 09:08:01 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఉపఎన్నిక జరగనున్న సంగతి మనకు తెలిసందే. కానీ ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్న అందరి మదిని చెదరగొడుతుందనేది వాస్తవం. ఎందుకంటే ఈ ఉపఎన్నికని రాష్ట్ర రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆత్మగౌరవ సమస్యగా పరిగణించుకుంటున్నాయి. అయితే ఎలాగైనా సరే ఈ ఎన్నికలో గెలవాలని ఎవరి ప్రణాళికలను వారు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా హుజుర్ నగర్ ప్రజల మనసు గెలిచే పనిలో పడ్డారని సమాచారం.

అయితే గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కి కంచుకోటగా మాయినటువంటి హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ని ఓడించి అక్కడ తెరాస జెండా ఎగరేయాలని తెరాస అధిష్టానం తీవ్రంగా కష్టపడుతుంది. కాగా తెలంగాణ లో అధికారంలోకి వచ్చినప్పటినుండి కూడా తెరాస పార్టీ చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేసే పనిలో మునిగిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈమేరకు హుజూర్ నగర్ లో ఉత్తమ్ కి మాత్రం ఈ ఎన్నిక పరువు సమస్య గా మారింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి, తన భార్య గెలిస్తేనే తన రాజకీయ భవిష్యత్తు సరిగా ఉంటుందని, లేకపోతె ఉత్తమ్ రాజకీయ భవిష్యత్తు తో పాటు, కాంగ్రెస్ భవితవ్యం కూడా మునిగిపోవడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు.

కాగా ఈమేరకు తెరాస నేతలు ప్రచారంలో భాగంగా… హుజుర్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే, ఉత్తమ్ ఇంట్లో ఒక ఎమ్మెల్యే సంఖ్యా పెరుగుతుందే తప్ప, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, అందుకనే తెరాస అభ్యర్థికి ఒక్క అవకాశం ఇస్తే లాభాన్ని చూపిస్తామని ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం, అధికారంలో ఉన్నటువంటి తెరాస పత్తి వారు ఇన్నిరోజులుగా చేసిన అభివృద్ధి శూన్యం అని, రాష్ట్రాన్ని ఇంకా దిగజార్చుతున్నారని, ఇక్కడ తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మంచి అవకాశం ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఎవరిని నమ్ముతున్నారో, ఎవరికీ పట్టం కడుతారో తెలియాలంటే ఎన్నిక అయ్యేదాకా నిరాశ తప్పదు…