నాలుగు రోజుల్లో రిటైర్మెంట్.. కరోనాతో మృతి చెందిన నర్సు..!

Friday, June 26th, 2020, 08:59:06 PM IST


తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కరోనాపై పోరులో డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్ వర్కర్లు, ఇతరత్రా వైద్య సిబ్బంది కూడా కరోనా కాటుకు బలైపోతున్నారు.

అయితే హైదరాబాద్ ఛాతీ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్ నర్సు కరోనా భారిన పడి చనిపోయింది. కొన్ని రోజులుగా కరోనా వైరస్ పేషెంట్లకు సేవలు అందిస్తున్న క్రమంలో ఆమెకు కూడా కరోనా వైరస్ సోకడంతో గాంధీలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం కన్నుమూసింది. ఈ నెల 30వ తేదీన రిటైర్మెంట్ కాబోతుండగా అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.