హాస్టల్ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీస్ సూచన ఇదే

Wednesday, March 25th, 2020, 11:20:22 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మొత్తం దేశం అంతా లాక్ డౌన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ కి ఆటంకం తెచ్చేలా ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగా హాస్టల్ లలోనే ఉంటున్నారు. అయితే ఈ 21 రోజుల లాక్ డౌన్ కారణంగా హాస్టల్ నిర్వాహకులు తాము హాస్టల్ ఇక పై నడపాబోము అని అన్నారు. దానికి గాను ఆందోళన చెందిన విద్యార్థులు. ఉద్యోగులు అక్కడ హాస్టల్ లో ఉండేవారు ఒక్కసారిగా. పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించారు. తమను ఇళ్ళకు పంపల్సిందిగా అర్జీ పెట్టుకున్నారు.

అయితే ఈ విషయం పై పోలీస్ వ్యవస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అన్ని హాస్టళ్లు, పీజీ లు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులు తీరు పై, హస్తలర్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ చేసినా, సామాజిక దూరం పాటించాలని చెప్పిన, వారు అనుసరిం చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.