హైదరాబాద్ జర్నలిస్టులకు తాయిలం

Friday, September 12th, 2014, 06:09:55 PM IST


తెలంగాణ జర్నలిస్టులకు ప్రభుత్వం ఓ ఉచిత నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ఇకపై ప్రైవేట్ స్కూల్స్ లో ఉచిత విద్య అందించాలని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ లో విద్య ఖర్చుతో కూడుకున్నదని… తమ ఆదాయంతో పోల్చుకుంటే.. హైదరాబాద్ విద్య పెనుభారంగా మారుతుందని.. జర్నలిస్ట్ యూనియన్లు విద్యాశాఖకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ పై నిర్ణయం తీసుకుంది. ఇకపై హైదరాబాద్ లో జర్నలిస్ట్ పిల్లకు ప్రైవేటు చదువు ఉచితంగా అందబోతున్నదన్నమాట.