కన్నడ ప్రజల చిరకాల కోరిక ఈరోజు నెరవేరింది

Tuesday, September 17th, 2019, 02:25:38 PM IST

ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ, హైదరాబాద్ – కర్ణాటక ప్రాంతాలు సైనిక చర్య ద్వారా భారతదేశంలో విలీనం అయ్యాయి. ఆ తర్వాత ఇప్పటివరకు కూడా గుల్బర్గ, రాయచూర్, బీదర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ప్రాంతం
హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంగానే పిలవబడుతోంది.

దశాబ్దాల నుండి ఈ ప్రాంతం పేరును మార్చాలని కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అనేక రాజకీయ కారణాల వలన అది కుదరలేదు. ఎట్టకేలకు ఈ పనిని యడ్యూరప్ప సర్కార్ పూర్తి చేస్తోంది. ఈరోజు నుండి ఆ ప్రాంతం పేరు కల్యాణ – కర్ణాటకగా పిలవబడుతుందని, పేరు మార్పు అనంతరం కల్యాణ-కర్ణాటక ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక సచివాలయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు యడ్యూరప్ప తెలిపారు.