బిగ్ న్యూస్: హైదరాబాద్ లోని బేగం బజార్ లో వారం పాటు లాక్ డౌన్!

Friday, June 26th, 2020, 09:16:26 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజుకి వందల సంఖ్యలో మన దేశం లో మరణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో సైతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే దాదాపు 900 కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా హైదరాబాద్ లోని మార్కెట్ కి పేరు గాంచిన బేగం బజార్ లో ఒక వారం పాటు లాక్ డౌన్ అమలు కానుంది.

గడిచిన వారం లో 15 పాజిటివ్ కేసులు, ఇద్దరు కరోనా వైరస్ కారణంగా మృతి చెందడం తో హైదరాబాద్ కిరాణ మర్చంట్ అసోసియేషన్ లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నెల 28 నుండి జూన్ 5 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాం అని తెలిపింది. లాక్ డౌన్ ను ఎవరైనా దిక్కరిస్తే వారికి జరిమానా విధించడం జరుగుతుంది. అయితే కరోనా వైరస్ తీవ్రత పెరగడం కారణం గా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.