ఇంట్లో వ్యాయామం చేస్తున్న హైదరాబాద్ మేయర్!

Thursday, July 30th, 2020, 12:24:43 AM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్న సమయం లో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అయిన బొంతు రామ్మోహన్ సోషల్ మీడియా ద్వారా ఒక సందేశాన్ని అందించారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ గా తేలడం తో మేయర్ ఇంటికే పరిమితం అయ్యారు. స్వీయ నిర్బంధం లో ఉంటూనే, ప్రజలకు సందేశాన్ని అందించారు. కరోనా వైరస్ భారిన పడటం తో ఇంట్లో సమయం దొరికింది అని, దానిని కాస్త ఇలా ఉపయోగిస్తున్నా అని అన్నారు

వ్యాయామం చేస్తూ ఒక వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కరోనా నుండి కోలుకోవాలని తనకు విష్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కరోనా వైరస్ వచ్చిన వారు ఎవరు కూడా ఆందోళన చెండవడ్డు అని, వైద్యులు సూచించిన సలహాల మేరకు చికిత్స పొందాలని సూచించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నా, రికవరీ లో మాత్రం ముందు వరుస లో ఉంది అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.