విషాదం : మెట్రో స్టేషన్లో పైపెచ్చులు పడి మృతిచెందిన మహిళ

Sunday, September 22nd, 2019, 07:24:17 PM IST

హైదరాబాద్ లోని ఒక మెట్రో స్టేషన్ ప్రాంతంలో కొద్దీసేపటిక్రితం ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వర్షం నుండి తప్పించుకోడానికి మెట్రో స్టేషన్ కిందకి చేరుకున్నటువంటి ఒక మహిళ, ఆ స్టేషన్ లో పై పెచ్చులూడి ఆమె మీద పడి మృతిచెందింది. కాగా వివరాల్లోకి వెళ్తే… కొద్దీ సేపటిక్రితం నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి మనకు తెలిసిందే. కాగా అలా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఒక మహిళ మెట్రో స్టేషన్ కిందకి చేరుకుంది. కాగా ఇంతలోనే ఆ స్టేషన్ పైన ఉన్నటువంటి మెట్రో గోడలకున్నటువంటి పెచ్చులు ఊడిపోయి ఆ మహిళ మీద పడటంతో, ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా తక్షణమే స్పందించిన కొందరు, ఆమెని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, ఆ మహిళా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

కాగా మృతిచెందిన మహిళా పేరు మౌనిక గా గుర్తించారు. తాను కూకట్ పల్లి వాసి అని అధికారులు వెల్లడించారు. ఇకపొతే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెట్రో స్టేషన్లు ప్రస్తుతానికి చాలా ప్రాణాంతకంగా మారాయని పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మెట్రో రైళ్లు ప్రారంభం అయి కనీసం 2 సంవత్సరాలైనా గడవకముందే ఇలాంటి ప్రమాదం జరగడంతో స్థానికులందరు కూడా భయపడుతున్నారు. అంతేకాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇంత త్వరగా ప్రమాదం జరిగినటువంటి మెట్రో నిర్మాణం పటిష్టత పైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు…