హైపర్ ఆది మిస్టేక్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..!

Thursday, January 23rd, 2020, 06:10:48 PM IST

హైపర్ ఆది తన మాటలను తూటాలుగా చేసి నాన్‌స్టాఫ్ పంచ్‌లతో అందరిని అలరిస్తుంటారు. అయితే తన కామెడీ స్కిట్లతో జబర్దస్త్‌లో మంచి కమెడీయన్‌గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పలు సినిమాలలో కూడా ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. అయితే పంచ్ డైలాగ్‌లలో ఇంతటి దిట్ట అయిన ఆది ఒక చిన్న తప్పుతో నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు.

అయితే ఆ తప్పును గమనించి దానిని సరిచేసుకునే లోపే సోషల్ మీడియాలో ఆదిని ఆడేసుకున్నారు. నేడు ప్రముఖ కమెడీయన్ ఎంఎస్ నారాయణ వర్థంతి సందర్భంగా శ్రేయాస్ మీడియా ఎం.ఎస్.నారాయణకు నివాళులు చెబుతూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అయితే అదే ఫోటోను షేర్ చేసిన ఆది తాను ఇచ్చే క్యాప్షన్‌లో మాత్రం పొరపాటున హ్యాపీ బర్త్‌డే సార్ అంటూ రాశాడు. ఇంకేముంది ఇది తెలుసుకున్న ఆది తిరిగి రీపోస్ట్ చేస్తూ నివాళులు అర్పించిన అప్పటికే జరగరాని తప్పు జరిగిపోయింది. మొదట ఆది పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనితో నెటిజన్లు వర్ధంతి, జయంతికి కూడా తేడా తెలియదా అంటూ ఆదిపై సీరియస్ అయ్యారు.