నా ఫ్రెండ్స్ టైంబాంబ్ అని పిలుస్తారు!

Sunday, February 12th, 2017, 12:16:54 PM IST


పాల‌బుగ్గ‌ల హ‌న్సిక దేశ‌ముదురు సినిమాతో క‌థానాయిక‌గా తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమాతోనూ యూత్ గుండెల్ని ట‌చ్ చేసింది. ద‌శాబ్ధంపైగానే స్టార్‌డ‌మ్‌ని కొన‌సాగిస్తూ తెలుగు, త‌మిళ్‌, హిందీలో నాయిక‌గా కొన‌సాగుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఎ డేట్ విత్ అన‌సూయ కార్య‌క్ర‌మంలో కొన్ని నిజాల్ని బ‌హిర్గతం చేసింది.

త‌న‌కి సినిమా ఇండ‌స్ట్రీ రెడ్ కార్పెట్ ప‌రిచి పిలిచింది. ఇత‌ర నాయిక‌ల్లాగా ఫోటోలు ప‌ట్టుకుని ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితిత‌న‌కి క‌ల‌గ‌లేద‌ని చెప్పింది. పూరీగారు పిలిచారు. ఫోటోషూట్ చేశారు. అదే ఇక్క‌డ తొలి ఫోటో షూట్ అని కూడా చెప్పింది. త‌న‌ని స్నేహితులంతా టైమ్ బాంబ్ అని పిలుస్తార‌ని చెప్పింది. నిజ‌మే దాదాపు ప‌దేళ్ల కింద‌ట తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైంది ఈ టైమ్ బాంబ్‌. కుర్రాళ్ల గుండెల్లో హ్యూమ‌న్ బాంబ్‌. ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని వారి పోష‌ణ చూస్తూ సామాజిక బాధ్య‌త‌లోనూ పై స్థాయిలో ఉందీ భామ‌.