ఈ సినిమా రిలీజ్ ముందు, తర్వాత నిద్ర పట్టలేదు : సూపర్ స్టార్ మహేష్

Monday, April 23rd, 2018, 01:15:55 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల ప్రభంజనంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా విషయమై సూపర్ స్టార్ మహేష్ ఒక ఆసక్తికరమైన విషయం ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఈ సినిమా విజయం ముందుగానే ఊహించినప్పటికీ విడుదలకు ముందు 10 రోజులుగా నిద్రపట్టలేదు, అలానే సినిమా రిలీజ్ అయిన తరువాత వస్తోన్న రెస్పాన్స్ చూసి సంతోషంతో నిద్రపట్టడం లేదు అన్నారు. “నాకు తెలిసి నా కెరియర్లో నేను బాగా నటించిన సినిమాల జాబితాలో ఈ సినిమా ముందుగా నిలుస్తుంది.

ఈ సినిమాలోని పాత్రలను కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దారు. పవర్ ఫుల్ మూవీగా జనం ముందు నిలబెట్టారు . ఇక ఇది రాజకీయ నేపథ్యంతో కూడిన కథే అయినా, ఎక్కడా వివాదాలకు అవకాశం లేకుండా చూడటం విశేషం. ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశాలు ఏ మాత్రం గుర్తుపెట్టుకున్నా అంతకి మించిన సంతోషం లేదు” అని అన్నారు. అలానే ఇకపై అభిమానులు కోరుకునే చిత్రాల్లోనే నటిస్తానని, ప్రయోగాలు చేసి అలసిపోయానని ఆయన చెప్పుకొచ్చారు…..

  •  
  •  
  •  
  •  

Comments