‘నేల టికెట్టు’ లో నటించే అవకాశం అంత తేలికగా రాలేదు : హీరోయిన్ మాళవిక

Tuesday, May 22nd, 2018, 12:06:05 PM IST

మంచి టాలెంట్ ఉంటే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెలుగువారితో పాటు నార్త్ భామలకు కూడా ఇక్కడ అవకాశాలు దొరుకుతుంటాయి అనడానికి, ఇక్కడకి వచ్చి మంచి పేరు సంపాదించిన ఎందరో నార్త్ ఇండియన్ భామలను చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం ఆ విధంగా నార్త్ నుండి తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న భామ మాళవిక శర్మ. స్వతహాగా లా చదువుతున్న మాళవిక నటనపై మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అంటోంది. మొదట ఈ చిత్రం ఆడిషన్స్ జరుగుతున్నపుడు తనకు చాలా భయం వేసిందని, తన వంతు రాగానే కొన్ని తెలుగులో రాసిన డైలాగులు తన చేతికి ఇచ్చి చదవమన్నారని చెప్పింది. అయినా సరే ఎలాగోలా ఏ మాత్రం తడపడకుండా చదివానని, అలా తనకు ఈ చిత్రం లో నటించే అవకాశం వచ్చిందని చెపుతోంది మాళవిక.

మాస్ మహారాజ రవితేజ హీరోగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తాను ఒక మెడికో పాత్ర పోషిస్తున్నట్లు చెప్పింది మాళవిక. ఈ చిత్రంలో తాను అబ్బాయిలను కూడా గడగడ లాడించే గడుసైన భామగా నటిస్తోందట. ఇక హీరో మాస్ మహారాజ రవితేజ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పనవసరం లేదని, నిజానికి ఆయన పక్కన నటించాలంటే అది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెపుతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తనకు చిత్ర షూటింగ్ సమయంలో ఎంతో హెల్ప్ చేసారని, ఇక నిర్మాత రామ్ తాళ్లూరి గారి బ్యానర్ ద్వారా తాను తెలుగులోకి ప్రవేశిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది అని చెపుతోంది ఈ భామ. కాగా ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా నేలటికెట్ విడుదల కానుంది…..

  •  
  •  
  •  
  •  

Comments