అజిత్, విజయ్ ల విషయంలో అవి నచ్చవు : హీరో విశాల్

Friday, April 27th, 2018, 12:27:44 PM IST

హీరో విశాల్ కు తమిళం లోనే కాక తెలుగు లోను మంచి మార్కెట్ వుంది. తొలి విజయం పందెం కోడి తర్వాత ఆయన తెలుగు లో కూడా మంచి క్రేజ్ సంపాదించారు. ఒక వైపు నటుడిగా మరొకవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, అలానే నటీనటుల సంగం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఇరుంబుతిరై, సండకోళి 2 చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇవి రెండూ కూడా ఆయన స్వీయ నిర్మాణంలో వస్తున్నవే. అదులో ఇరుంబుతిరై ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా వుంది. దీన్ని తెలుగులో అభిమన్యుడుగా విడుదల చేస్తున్నారు. కాగా ఆయన నేడు చెన్నైలో విలేఖరులతో మాట్లాడుతూ,

ఇళయదళపతి హీరో విజయ్ ది ఒక ప్రత్యేక శైలి అని, చిన్నప్పటినుండి ఎన్నో పోరాటాలు చేసి ఆయన ఈ స్థాయికి వచ్చారని అన్నారు. అంతేకాదు, ఆయన ఎటువంటి విమర్శలు పట్టించుకోరు, ఆయనలా డాన్స్ మేము ఎవరుము చేయలేమని అన్నారు. అంతేకాదు ఆయన మంచి నటుడు కూడా, కాకపోతే ఆయనలో ఒక విషయం మాత్రం తనకి నచ్చదు అన్నారు. ఆయన ఏది కూడా బాలేదు అని చెప్పరు అని అన్నారు. ఇక తలా అజిత్ నటన అద్భుతమని, ఆయన క్రేజ్ సూపర్ అని పొగిడారు. కాకపోతే ఆయనలో ఒక నచ్చని విషయం ఏమిటంటే, ఆయనను నటులు ఎవ్వరు సైతం సంప్రదించలేనంత దూరంగా ఉంటుంటారు, అది నాకు నచ్చదు అన్నారు.

ఇటీవల తమిళ సినీ పరిశ్రమలో జరిగిన సమ్మె సాధారణమైనది కాదని, 48 రోజులపాటు సమ్మె చేయడం, విజయం సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదని అన్నారు. ఇది సమిష్టి విజయమని, దేశం గర్వించేలా తమిళ పరిశ్రమ ముందుకు సాగుతోంది అని అన్నారు. రానున్న ఆరు నెలల్లో తమిళ పరిశ్రమ మరింత ఉత్తమంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments