నాకు బ్రతకాలని లేదు అంటున్న ప్రముఖ హీరోయిన్

Friday, April 13th, 2018, 03:05:54 PM IST

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి కంటే ముందు పెదవి విప్పిన హీరోయిన్ మాధవీలత. వాస్తవానికి టాలీవుడ్ లో తనకు కూడా అటువంటి వేధింపులు ఎదురయ్యాయని, అయితే తాను మాత్రం శ్రీ రెడ్డి లా వారి పేర్లు బయటపెట్టలేనని, తనకి కుటుంబం ఉందని, వారి బాగోగులే తానేమి ముఖ్యమని చెప్పారు. తనకే కాదని, పలువురు తెలుగు అమ్మాయిలకు ఇటువంటి ఘటనలు జరిగాయని, కాకపోతే ప్రతిఒక్కరు అటువంటి వారి పేర్లను మాత్రం బయటపెట్టలేకపోతున్నారని అన్నారు. అయితే నేడు తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఒక సంచలన పోస్ట్ పెట్టారు. తనకు బతకాలని లేదంటూ, ఛీ ఏం దేశం రా ఇది అంటూ ఆమె మండిపడ్డారు. నేడు గుడిలో బాలిక పై సామూహిక అత్యాచారం అనే వార్తను ఉద్దేశించి ఆమె పోస్ట్ చేశారు.

ఆమె చేసిన పోస్ట్ సారాంశం ఏంటంటే, నిజంగా చెబుతున్నా నాకైతే బతకాలని లేదు. ఛీ ఏం దేశం రా ఇది. నా దేశం మంచిది. దేశభక్తి, మేమంతా దేవుళ్ళం. ఇక్కడ ఆడపిల్ల సురక్షితం, మీ మూవీ ఇండస్ట్రీ దరిద్రం. నీకు చెప్పే దారే లేదు. ఎన్ని మాటలు. మరి ఏంటి ఇది చిన్నపిల్ల పైనా అరాచకం మన దేశంలో. ఆడపిల్ల అంటే కడుపులో నుండే రక్షణ. బయటకు వస్తే భక్షణ. ఏమిరా ఈ దౌర్భాగ్యం. పసిబిడ్డరా. కోసి కారం పెట్టాలి ఇలాంటి వారిని. ఇప్పుడు మాట్లాడండి బ్రదర్స్ అంటూ ఆవేదనతో మాధవీలత పోస్ట్ చేసారు…..