ప్రభాస్ సినిమాలో నటిస్తున్నానంటున్న అర్షి ఖాన్ ?

Thursday, February 1st, 2018, 10:44:35 AM IST


ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నానని చెబుతుంది హాట్ భామ అర్షి ఖాన్? బిగ్ బాస్ సీజన్ 11 రియాలిటీ షో లో పాల్గొన్న ఈ భామ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. అయితే ఈ విషయంలో నేను అబద్దం చెప్పడం లేదని, బిగ్ బాస్ సీజన్ తరువాత ఆ సినిమా నిర్మాతలు నన్ను కలిశారు. ఈ సినిమాలో నటించమని చెప్పారని, అగ్రిమెంట్ కూడా తీసుకున్నారని చెప్పింది. బాహుబలి లాంటి క్రేజీ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది అర్షి ఖాన్ ? ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటానని చెబుతుంటే .. మరో వైపు అర్షి ఖాన్ కావాలంటే ప్రభాస్ సినిమాలో నటిస్తున్నానని చెబుతుందని, ఆమె మాటల్లో నిజం లేదనే వార్తలు వస్తున్నాయి.