నాకు క్యాన్సర్ లేదు, క్షేమంగా వున్నానంటున్న సీనియర్ నటి!

Tuesday, May 22nd, 2018, 05:15:07 PM IST

ప్రస్తుతం మొబైల్ ఫోన్ ధరలు, అలానే టెలికాం టారిఫ్ ల ధరలు చాలా వారు తగ్గి దాదాపుగా మధ్య, దిగువర తరగతి వారికి కూడా అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండడం కామన్ అయిపోయింది. ఇక అందులోనూ దాదాపుగా అందరూ వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్ లను కలిగి ఉండడంతో ఎటువంటి న్యూస్ అయినా సరే సెకన్లలో దావాలంలా ఒకరినుండి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. నిజానికి ఈ సోషల్ మీడియా మాధ్యమాలను మంచికి ఉపయోగించకపోయినా పర్లేదుగాని, చెడును వ్యాప్తి చేసేందుకు మాత్రం ఉపయోగించకండి అని ఎందరు చెప్తున్నా కొన్ని ఫేక్ వార్తలు మాత్రం షికారు చేస్తున్నాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే ఇటీవల చంద్ర ముఖి, కథానాయకుడు, మహారథి చిత్రాల దర్శకుడు పి వాసు మరణించారని కొందరు దుండగులు వాట్సాప్ లో తప్పుడు ప్రచారాలు చేశారు. ఇక చివరికి చేసేది లేక డైరెక్ట్ గా పి వాసు గారు ఒక వీడియో తీసి నేను బ్రతికే వున్నాను, తదుపరికి చిత్రాల చర్చల్లో ఉండి, కొద్దిరోజులుగా వూళ్ళో లేకపోవడం వల్ల ఇటువంటి పుకార్లు వచ్చాయి, వాటిని నమ్మవద్దని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ఇక పోతే నేడు సీనియర్ నటి, నటుడు శరత్ కుమార్ భార్య అయిన రాధికా కు భయంకరమైన క్యాన్సర్ వ్యాధి సోకిందని, అది కూడా బ్లడ్ క్యాన్సర్ అవడం వల్ల ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు, అందుకే చాలా రోజులుగా బయట కనపడడంలేదని కొందరు పుకార్లు సృష్టించారు.

ఈ వార్త కొద్దిరోజులుగా తమిళ నాడు అంతటా గుప్పుమంటోంది. కాగా నేడు ఒక అభిమాని రాధికా గారిని ట్విట్టర్ లో మేడం మీకు క్యాన్సర్ సోకిందట నిజమేనా అని ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన రాధిక నాకు అటువంటి సమస్యలేమీ లేవు, అవి పూర్తిగా పుకార్లు, నేను క్షేమంగా వున్నాను, నా ఫ్యామిలీతో హాయిగా జీవితాన్ని గడుపుతున్నాను అని సమాధానమిచ్చారు. కాబట్టి ఇటువంటి నెగటివ్ వార్తలను ముఖ్యంగా సెలెబ్రిటీ లపై ప్రచారం చేయవద్దని, దానివల్ల వారే కాదు వారికి సంబందించిన వారు కూడా ఇబ్బందుల్లో పడతారని పలువురు సినీ పరిశ్రమ వ్యక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments