నమితను పెళ్లి చేసుకోలేదు బాబోయ్.. అంటున్న సీనియర్ నటుడు ?

Saturday, October 14th, 2017, 10:00:58 PM IST


బొద్దుగుమ్మ నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబు పెళ్లి చేసుకున్నాడని కోలీవుడ్ లో తెగ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సినిమాలు చేతిలో లేని నమిత గత కొన్ని రోజులుగా శరత్ బాబుతో సన్నిహితంగా ఉంటుందని, వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నారంటూ .. ఇటీవలే పెళ్లి చేసుకున్నారంటూ అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరగడంతో అందరు షాక్ అయ్యారు .. అయితే ఈ వార్తలపై టెన్షన్ పడ్డ నటుడు శరత్ బాబు వెంటనే స్పందించాడు .. నమితను పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని .. అయన అన్నాడు. అసలు తనకు, నమితకు ముడి పెట్టి వార్తలు రావడం దారుణం అని, అసలు తాను నమితను చూసి చాలా రోజులు అయిందని అన్నారు. దాదాపు 60 ఏళ్ళు దాటినా శరత్ బాబు నమితను పెళ్లి చేసుకోవడం ఏమిటనే ప్రశ్నలు అటు పరిశ్రమ నుండి వచ్చాయి. అప్పట్లో రామప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు కొన్ని రోజులకు విడిపోయాడు. ఆ తరువాత పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని కొన్నాళ్లక్రితం ప్రకటించాడు, కానీ ఎవరిని అన్న విషయం చెప్పలేదు. దాంతో ఇలా నమిత తో శరత్ బాబు కు ముడివేస్తూ ఇలా వార్తలు వెలువడ్డాయి.

  •  
  •  
  •  
  •  

Comments