నేను ఆవిడ గురించి మాట్లాడదలుచుకోలేదు : శృతి హాసన్

Sunday, April 29th, 2018, 12:53:08 PM IST

తమిళ నటుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్ అనగనగ ఒక ధీరుడు చిత్రంతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి చిత్రం పరాజయం తరువాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చినప్పటికి సక్సెస్ రావటానికి మాత్రం కొంత సమయం పట్టింది. ఆ తరువాత గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, బలుపు, ఎవడు చిత్రాలతో ఆమె మంచి విజయాలు దక్కించుకున్నారు. కాగా ఆమె ప్రస్తుతం తెలుగు మూవీస్ చేయడం తగ్గించారు. గత తొమ్మిది సంవత్సరాలు సినిమాలో నటిస్తున్న తనకు ఇన్నాళ్లకు కొంత విశ్రాంతి తీసుకోవాలన్పించింది అందుకే హాయిగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాను అన్నారు.

ఈ సందర్భంగా ఇటీవల ఆమె ఒక చెన్నై పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కమల్, గౌతమి విడిపోవడం గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అది తనకు తెలియదని, అయినా ఆమె జీవితంలో తాను లేదు, తన గురించి మాట్లాడదలుచుకోవడం లేదని అన్నారు. మైఖేల్ కొర్సలే కేవలం తనకు మిత్రుడు మాత్రమే అని తమ మధ్య మీరనుకే ఎటువంటి ఇతర సంబంధం లేదని అన్నారు. మీరు రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేస్తున్నారు అని అడగ్గా, రాజకీయాలనేది చాల పెద్ద అంశమని, సమాజానికి సంబంధిచిన వ్యవహారం కాబట్టి తనకు రాజకీయ పరిజ్ఞానం వస్తేగాని దానిగురించి మాట్లాడలేనని అన్నారు.

తన జీవితంలో రహస్యాలు లేవని, తన ఇష్టాలకు ఇంట్లో వారు ఎపుడు కధానారని అన్నారు. తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తన చుట్టూ లేకపోవడంతో ఇటీవల కొంత ఆ భాష మర్చిపోయానని, అయితే పూర్తిగా మాత్రం కాదని తనకి తెలుగు అంటే ఇష్టమని అన్నారు. ఈ మధ్య విడుదలయిన తెలుగు సినిమాల్లో తాను అర్జున్ రెడ్డి చూశానని, మంచి విభిన్న కథాంశంతో దర్శకుడు సినిమాని నడిపిన తీరు బాగుందని అన్నారు. చాల కాలం తర్వాత మళ్లి సినిమా కథలు వింటున్నాను, నాకు నచ్చిన పాత్ర దొరికితే వెంటనే ఆ సినిమాకు సైన్ చేస్తాను అన్నారు. అలానే సినిమా నిర్మాణం తో పాటు సంగీతం, రచన తదితర అంశాలపై దృష్టి సారించానని ఆమె చెప్పుకొచ్చారు…..

  •  
  •  
  •  
  •  

Comments