‘భరత్ అనే నేను’ సినిమా బాగా ఎంజాయ్ చేశాను : కేటీఆర్

Wednesday, April 25th, 2018, 03:06:17 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ భరత్ అనే నేను. విడుదలయిన తొలి రోజునుండే ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల పరజలయ తర్వాత కొంత మేర డీలా పడ్డ మహేష్ బాబు ఈ సినిమా అద్భుత విజయంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ, నాకు డబ్బు, పేరు, ఆస్తులు అన్ని ఉన్నప్పటికీ అభిమానులకి మంచి హిట్ సినిమా ఇచ్చి వారిని గర్వపడేలా చేసేవరకు నా మనసు ఆనందంగా ఉండదని ఆయన అన్నారు.

అన్నట్లుగానే మొత్తానికి అభిమానులకి ఒక సూపర్ హిట్ ప్రామిస్ చేసి నిలబెట్టుకున్నారు. అయితే ఈ సినిమాని నేడు తెలంగాణ ఐటి శాఖా మంత్రి కేటీఆర్ వీక్షించారు. మహేష్ బాబు, కొరటాల ఆహ్వానం మేరకు ఆయన ఈ సినిమాను చూసినట్లు తెలుస్తోంది. సినిమా చాలా బాగుందని, ఆద్యంతం చాలా ఎంజాయ్ చేసానని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మంచి మిత్ర్రుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల సినిమాలో ప్రజాజీవితాన్ని, సమస్యలను ఎదుర్కునే సన్నివేశాలను బాగా చూపించారని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments