ఆ సినిమా ప్లాప్ అయిందని బాధపడ్డాను : సుకుమార్

Thursday, April 12th, 2018, 05:55:15 PM IST

వెరైటీ చిత్రాల దర్శకులు సుకుమార్ తీసే చిత్రాలు చూస్తే ఆయన ఆలోచన విధానం ఎంత విభిన్నంగా ఉంటుందో అర్ధం అవుతుంది. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో ఆర్య, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆయన సినిమాలు కొన్ని అపజయం పాలయినప్పటికీ బుల్లితెరపై అవి ప్రదర్శితమయినపుడు మంచి రేటింగ్స్ సంపాదిస్తుంటాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా అందించిన సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అయన ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు.

అందులో ముఖ్యంగా మహేశ్ తో చేసిన ‘1 నేనొక్కడినే’ ప్లాప్ అయినప్పుడు మీరెలా ఫీలయ్యారు అనే ప్రశ్న సుకుమార్ స్పందిస్తూ, 1 నేనొక్కడినే సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకున్నాను. అలా జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. మొదటి నుంచి కూడా నేను సినిమా తీసే విధానం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయలేను. ఒక సినిమా చేస్తున్నంత సేపు మనసంతా దానిపైనే ఉంటుంది. నిద్రకూడా సరిగ్గా పట్టదు. ఒక సినిమా కోసం పడిన కష్టమంతా మరిచిపోయి సంతోషంగా ఉండేది అది హిట్ అయిన రోజునే. అది హిట్ కాకపోతే మనసుకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ‘1 నేనొక్కడినే’ సినిమా అలాంటి బాధకి నన్ను గురిచేసింది అని చెప్పుకొచ్చారు.

అసలు ఆ సినిమా ప్లాప్ కి తానే కారణమని, సూపర్ స్టార్ మహేష్ తనని నమ్మి సినిమాకి తన ప్రాణం పెట్టారని, కానీ తాను ఆ సినిమాకి న్యాయంచేయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా త్వరలో మహేష్ కి ఒక సూపర్ హిట్ ఇస్తానని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో సుకుమార్ తో మహేష్ బాబు చిత్రం వుండనుందని, అదికూడా ఆయన రంగస్థలం తీసిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనే వుండనుందని, త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం…..

  •  
  •  
  •  
  •  

Comments