నాకు అమ్మాయి దొరికిందంటున్నసల్మాన్ ఖాన్

Tuesday, February 6th, 2018, 05:37:06 PM IST

బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి కోసం ఆయన కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు మాత్రమే కాదు ప్రేక్షకులు, అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన సహ నటులు ఆయన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ అని వివిధ సందర్భాల్లో ప్రశ్నించడం తెలిసిందే. కాగా ఆయన మంగళవారం ‘నాకు అమ్మాయి దొరికిందోచ్’ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్‌ చేసి అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. దీంతో ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌ అయిన అభిమానులు ఆయనకు కాబోయే శ్రీమతి దొరికిందని తెగ సంతోషపడుతూ కామెంట్స్‌, ట్వీట్స్ చేశారు. అయితే ఆ తరువాత కొద్దిసేపటికే సల్మాన్‌ ‘కంగారుపడాల్సింది ఏమీ లేదు. నా బావమరిది ఆయుష్‌ శర్మ నటిస్తున్న లవ్‌రాత్రి’ సినిమాకి కథానాయిక దొరికింది. ఆమె పేరు వరీనా అంటూ ట్వీట్‌ చేస్తూ ఆమె ఫొటోను కూడా పోస్ట్‌ చేయడం ద్వారా అయన అభిమానుల ఆశల పై నీళ్లు చల్లారు. కొన్నాళ్లుగా రొమేనియన్‌ మోడల్‌ ఉలియా వంతూర్‌తో సల్మాన్‌ ప్రేమలో ఉన్నారని వార్తలు వెలువడుతున్న విషయం మనకు విదితమే. ఉలియా కూడా అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి అక్కడక్క పార్టీల్లో కనిపించిన సందర్భాలూ వున్నాయి, అంతేకాక ఆవిడ ఈమధ్య సల్మాన్‌ కుటుంబసభ్యులను కూడా కలిసినట్లు, దీంతో వీరిద్దరి వివాహం నిశ్చయమైందంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై సల్మాన్‌ ఇప్పటివరకు ఏ విధంగానూ స్పందించలేదు. కానీ ఉలియా మాత్రం సల్మాన్‌ కుటుంబంతో తనకు మంచి బంధం ఉందని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల టైగర్‌ జిందా హై సినిమాతో మంచి హిట్‌ అందుకున్న సల్మాన్‌ ప్రస్తుతం ‘రేస్‌ 3’ సినిమా చిత్రీకరణకు సిద్ధమౌతున్నారు. ఇందులో అనిల్‌ కపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు….