స్పైడర్ ప్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు : రకుల్

Thursday, January 11th, 2018, 04:45:26 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ పోయిన సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కంబినేషన్లో నటించిన ‘స్పైడర్’ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ కెరీర్ లో స్పైడర్ మరొక భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఒక ప్రముఖ ఆంగ్ల ప్రత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతూ స్పైడర్ చిత్రం పరాజయంపాలావుతుంది అనే విషయం తనకు ముందే తెలుసునని అన్నారు. అయితే ఈ వార్త ఆనోటా ఈనోటా పడి చివరకు దర్శకుడు మురుగదాస్ వద్దకు చేరడం తో ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆమె మాటలపై కోపంగా వున్నారని సమాచారం. స్పైడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మురుగదాస్ ని గొప్ప డైరెక్టర్ అని పొగిడిన రకుల్ ఇప్పుడు చిత్రం పరాజయం పాలైందని ఇలా మాట్లాడడం సరికాదని అంటున్నారు….