తమన్నా కంటే బెటర్ గా చూపిస్తానంటున్న హీరోయిన్ ?

Wednesday, October 18th, 2017, 11:29:03 AM IST

గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా అంటే సౌత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమన్నా గ్లామర్ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా ఒక్క సరిగా క్రేజ్ తెచ్చుకున్న షాలిని పాండే .. తెలుసుగా .. ఆ ఒక్క సినిమాతోనే ఎవ్వరికి రానంత క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు తమన్నాకు లింక్ ఏమిటి అని షాక్ అవుతున్నారా ..ఉంది అదేమిటంటే .. ఆ మధ్య తమన్నా హీరోయిన్ గా నటించిన 100 పర్సెంట్ లవ్ ఇప్పుడు తమిళ రీమేక్ లో షాలిని నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తమన్నా ఆ సినిమాలో గ్లామర్ని బాగా చూపించింది కదా .. మీరు కూడా అలాగే గ్లామర్ పాత్రలో కనిపిస్తారా అని అడిగితె ఏమని చెప్పిందో తెలుసా .. నేను తమన్నాలా ఎందుకు చూపిస్తాను .. నాలాగే నేను చూపిస్తాను అంటూ షాక్ ఇచ్చింది. తమన్నా ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది, బాగా చేసింది .. నేను కూడా ఈ పాత్రలో గ్లామర్ పాత్రలో ఆకట్టుకోవడమే కాకుండా ఆమెకన్నా ఇంకాస్త గ్లామర్ గా కనిపిస్తా అంటూ షాక్ ఇచ్చింది. సో మొత్తానికి అర్జున్ రెడ్డి హీరోయిన్ ఫోకస్ అంతా ఇప్పుడు గ్లామర్ పైనే పడిందన్నమాట. చూద్దాం ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తుందో మరి!!

  •  
  •  
  •  
  •  

Comments