ఆ హీరో చేసిన తప్పుకి చెంప చెళ్లుమనిపించానంటున్న ఫేమస్ హీరోయిన్

Wednesday, March 14th, 2018, 09:56:55 PM IST

ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే ఏది మాట్లాడినా చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణ చిత్ర పరిశ్రమలోనూ మంచి కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న వివిధ సందర్భాల్లో చేసిన కామెంట్లు వార్తల్లో నిలిచాయి. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

దీంతో అప్పట్లో అది హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఓ కార్యక్రమం లో భాగంగా ఆమె ఓ అగ్ర హీరో చెంప పగలగొట్టానని చెప్పి షాకిచ్చారు. బాలీవుడ్‌ నటి నేహా ధూపియా టాక్‌ షోకు రాధిక హాజరయ్యారు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకున్నారు. ఓ సినిమా సెట్స్‌లో తొలిరోజు ప్రముఖ దక్షిణాది హీరో నా కాలు తడమటం ప్రారంభించారు. నేను షాక్‌ అయ్యా, నిజానికి అప్పటివరకు మా ఇద్దరి మధ్య ఎటువంటి పరిచయం కూడా లేదు. అయినప్పటికీ మరో ఆలోచన లేకుండా అతడి చెంప పగలగొట్టాను అని ఆమె చెప్పారు. కాగా ఇటీవల రాధికా ఆప్టే సోషల్‌మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

తన భర్త బెనడిక్ట్‌ టేలర్‌ తో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ, బికినిలో కనిపించైనా విషయం తెలిసిందే. దీంతో నెటిజన్స్ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ పై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రాధిక, ఇటీవల మీడియా సమావేశంలో నోరు విప్పక తప్పలేదు. అందుకు సంబందించిన ప్రశ్న ఎదురవ్వడంతో స్పందించారు. కామెంట్ చేసిన వారు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు ఎందుకు స్పందించాలి. నేను ఆ విషయం గురించి మాట్లాడాను. అయినా బికినీలో కనిపిస్తే తప్పేంటి. బీచ్ లో బికినీ వేసుకోక చీర కట్టుకోవాలా ఏంటి అని రాధికా ఒక్కసారిగా కోపాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే….