రూ .400 కోట్ల అక్రమాస్తులు..మంత్రి నారాయణ బినామీ అతడేనా..?

Thursday, December 29th, 2016, 10:33:11 PM IST

house
ఏపీ పురపాలక శాఖామంత్రి నారాయణ సన్నిహితుడైన గుణశేఖర్ కు సంబందించిన ఆస్తులపై ఆదాయపా పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడివద్ద వందల కోట్ల రూపాయలు బయట పడ్డట్టు సమాచారం. ఈ విషయం లో ఆదాయపు పన్ను అధికారులు గోప్యతని పాటిస్తున్నారు. దీనికి ఏకారణం ప్రభుత్వం నుంచి ఒత్తింది ఉండడమే అనే ప్రచారం జరుగుతోంది.

గుణశేఖర్ వద్ద ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటికే రూ 400 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. అతడు నారాయణకు బినామీ అయి ఉండే అవకాశం ఉన్నట్లు ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. తిరుపతి లో టిటిడి పరిపాలనా భవనానికి పక్కన ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని గుణశేఖర్ కొనుగోలు చేశాడు. అతడు మంత్రి నారాయణ బినామీ అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments