మంత్రి ఇంట్లో 12 కిలోల బంగారం..రూ 112 కోట్ల అక్రమ సొమ్ము..!

Tuesday, January 24th, 2017, 01:50:30 AM IST

money
మంత్రి ఇంట్లో ఉన్న అక్రమ సొమ్ము చూసి ఐటి అధికారులే అవాక్కయ్యారు.ఐటి అధికారుల సోదాల్లో కర్ణాటక మంత్రి ఇంట్లో రూ 112 కోట్ల లెక్కచూపని సొమ్ము బయటపడింది. సిద్ద రామయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్న సతీష్ జర్కి హోలి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టరన్న సమాచారంతో ఐటి అధికారులు ఆయన ఇంట్లో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో రూ 112 కోట్ల డబ్బుతో పాటు 12 కేజీల బంగారాన్ని కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఐటి అధికారులు మంత్రి కుటుంబసభ్యులను పలు ప్రశ్నలతో వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.మంత్రి ఇంట్లో ఆయన బంధువుల ఇంట్లో ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఐటి అధికారులు దాడులు నిర్వహించడంతో మంత్రి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనితో పోలీస్ లు జోక్యం చేసుకోవలసి వచ్చింది.