అమ్మ చనిపోయిన మర్నాడే షూటింగ్ చేద్దామనుకున్నా : జాన్వీ కపూర్

Thursday, July 26th, 2018, 09:45:46 PM IST


దివంగత నటి శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని వెండి తెరపై చూడాలని ఆమె ఎంతో అభిలషించారు. అయితే ఆమె ఆ కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ప్రస్తుతం జాన్వీ నటించిన తొలి చిత్రం ధఢక్ ప్రపంచవ్యాప్తంగా విడుదలయి మంచి కలెక్షన్లు సాధిస్తోంది. తొలి చిత్రమే మంచి హిట్ దిశగా దూసుకెళ్లడంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా విజయవంతం అవడంపై శాన్వికి పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు శుభాభినందనలు తెలిపినట్లు సమాచారం. ఇకపొతే సినిమా విజయవంతం అవడంతో శాన్వి నేడు ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ, వాస్తవానికి తన తల్లి మరణం తనని ఎంతో కలిచి వేసిందని, ఆ సమయంలో గుండె బద్దలైనంత పని అయిందని చెప్పింది. అయితే అంత కష్టంలో కూడా తాను శ్రీదేవి మరణించిన మర్నాడే షూటింగ్ లో పాల్గొనాలని అనుకుందట, అయితే అందుకు మనస్సు ఏ మాత్రం సహకరించకపోవడంతో కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుందట. ఈ చిత్ర విజయం నిజానికి తన కుటుంబానిదని,

ముఖ్యంగా తన తల్లిని అభిమానించేవారందరు తనను అభిమానించడం నిజంగా తన అదృష్టమని, ఇది తన విజయం కానేకాదని అంటోంది. ఇది కేవలం తన తొలి చిత్రమేనని, ఇంకా భవిష్యత్తులో చేయవలసిన చిత్రాలు ఎన్నోవున్నాయి, భవిష్యత్తు బాగుండాలని అమ్మని కోరుకున్నట్లు శాన్వి చెప్పింది. అయితే సినిమా విడుదల కు ముందు నిర్వహించిన ప్రీమియర్ షోలో పాల్గొన్న బాలీవుడ్ సెలెబ్రిటీలు షో చూసి వచ్చి తనను అభినందనలతో ముంచెత్తారని, నిజంగా అది ఎప్పటికి మరిచిపోలేని అనుభూతిగా ఆమె చెపుతోంది. సినిమా విడుదల రోజున రివ్యూ లు చదివానని, అయితే అందులో కొన్ని సినిమా బాగుంది అన్నపుడు సంతోషించాను, మరికొన్ని బాలేదు అన్నపుడు బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను అని చెప్పుకొచ్చింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమా భారత్ లో రూ.43 కోట్లు మరియు ఓవర్సీస్ లో రూ.11 కోట్లు వసూలు చేసి ఇప్పటికి మంచి స్టడీ కలెక్షన్లతో దూసుకెళుతోంది సినీ విశ్లేషకులు చెపుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments