పవన్ టైం ఇస్తే సినిమా చేస్తానంటున్న దర్శకుడు ?

Saturday, February 3rd, 2018, 03:01:43 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల విషయంలో సీరియస్ గా ఉన్న పవన్ సినిమాలు చేయనని చెప్పాడు. అయితే మొత్తంగా సినిమాలు మానేస్తానని చెప్పలేదు గాని .. ఏవైనా తనకోసం ప్రత్యేక పాత్రలు ఉంటె నటిస్తానని అంటున్నాడు. తాజాగా మాస్ దర్శకుడు వినాయక్ పవన్ తో సినిమా చేస్తానని అంటున్నాడు ? తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వినాయక్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ తో సినిమా ఎప్పుడు చేస్తానో చెప్పలేనని, ఆ విషయాన్నీ పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలనీ చెప్పారు. పవన్ తనతో సినిమా చేస్తానంటే తప్పకుండా చేస్తానని చెప్పాడు వినాయక్. అయన ప్రస్తుతం సాయి ధరమ్ తో చేస్తున్న ఇంటిలిజెంట్ సినిమా ఈ నెల 9 న విడుదల అవుతుంది.