టిఆర్ఎస్ లో చేరాలనుకుంటున్నాను : టాలీవుడ్ సీనియర్ నటి

Friday, May 4th, 2018, 02:37:38 PM IST

బాపు రమణల అద్భుత దృశ్య కావ్యం ‘ముత్యాలముగ్గు’ చిత్రంతో మంచి పేరు సంపాదించిన సంగీత, ఆ తరువాత వరుసగా కొన్ని మంచి చిత్రాలు చేశారు. అయితే రాను రాను ఆమె హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ బేస్డ్ పాత్రలనే ఎక్కువ పోషించారు. అయితే కొన్నాళ్ల క్రితం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె ప్రస్తుతం ఒకింత రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక టివి ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, తన జన్మస్థలం తెలంగాణలోని వరంగల్ అని, ఇక్కడ టిఆర్ ఎస్ పార్టీ వారు చేపడుతున్న అద్భుత కార్యక్రమాలు తనకి నచ్చాయని చెప్పుకొచ్చారు.

నిజానికి తనకు రాజకీయాలపై అంత ఆసక్తి లేదని, పదవులపై అంతకంటే ఆసక్తిలేదన్నారు. అయితే సినీ పరిశ్రమకు ఏదైనా చేయాలనీ మొదటి నుండి ఉండేదని, దానికోసం ఆమె ఏదైనా రాజకీయ వేదిక ద్వారా చేస్తే బాగుంటుంది అనుకున్నట్లు చెప్పారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశానని, మీరు సినీపరిశ్రమ వారికీ కూడా ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పను అన్నారు. ఆయన పాలన పద్ధతులు నచ్చాయని, అందుకే త్వరలో టిఆర్ ఎస్ లో ఒక సభ్యురాలిగా చేరి తనవంతు సేవ సినిమా పరిశ్రమకు చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు……

  •  
  •  
  •  
  •  

Comments