ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది : ‘దంగల్’ నటి

Friday, May 11th, 2018, 03:45:20 PM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ హీరోగా హర్యానాకు చెందిన మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగాట్ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం దంగల్. ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం లో మహావీర్ సింగ్ కూతుళ్లు గీత, బబిత ఫోగాట్ పాత్రల్లో జైరా వసీం, సాన్య మల్హోత్రా నటించారు. వీరిలో జైరాం వసీం ఈ చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను ఆమెకు జాతీయ అవార్డు లభించింది. అమీర్ ఆ తరువాతి చిత్రం సీక్రెట్ సూపరస్టార్ చిత్రంలో జైరా ముఖ్య పాత్రపోషించింది.

అయితే ప్రస్తుతం ఈ నటి తను చెప్పలేనంత మానసిక సంఘర్షణకు లోనవుతున్నానని, ఈ పరిస్థితిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేసింది. సిగ్గుపడకుండా తన డిప్రెషన్ కు సంబందించిన విషయాలను వెల్లడిస్తున్నాని అంటోంది. రోజు ఐదు యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటున్నాను, ఒక్కోసారి విపరీతమైన ఉత్సాహంతో ఆసుపత్రికి వెళ్ళవలసివస్తోంది అని చెప్పింది. వరుసగా కొన్ని వారాలపాటు నిద్ర ఉండడంలేదు, ఒక్కోసారి విపరీతంగా పడుకుంటున్నాను, తిండికూడా కొన్నాళ్ళు తినాలి అనిపించదు. ఒక్కొక్కప్పుడు విపరీతంగా తినేస్తున్నాను.

నా జీవితం సరిగా లేదనిపిస్తోంది. ఒక్కోసారి ఒళ్ళు నొప్పులు, వాపులు, భయం, వణుకు వస్తున్నాయి. ఆ డిప్రెషన్ వల్ల ఒక్కోసందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోంది. నాకు 12ఏళ్ళు వున్నపుడు విపరీతమైన పానిక్ ఎటాక్ తో బాధపడ్డాను, మళ్లి అదే బాధ 17ఏళ్లకు కల్గింది. డాక్టరుని సంప్రదిస్తే ఈ వ్యాధికి మందు తీసుకోవాలంటే 25ఏళ్ళు నిండాలి అంటున్నారు. నాకు ప్రస్తుతం 17 ఏళ్ళు. అయినా ఈ వయసులో డిప్రెషన్ ఏంటి అని డాక్టర్ అంటున్నారని వాపోయింది. ఇక తప్పక నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. అందుకే నేను పని, చదువు, సామజిక మాధ్యమాలు ఇలా అన్నింటినుండి కొంత విరామం తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం అయితే నేను రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పవిత్ర సమయంలో నా జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకుంటున్నాను. మీరు చేసే ప్రార్థనల్లో నన్ను కూడా గుర్తుంచుకోండి అంటూ పోస్ట్ చేసింది. జారిన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుత్తం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. పలువురు నెటిజన్లు జరీనా త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…….

Comments