నేను బ్రతికే వున్నాను అంటోన్న దర్శకుడు!

Tuesday, January 16th, 2018, 03:53:50 PM IST

ప్రముఖ దర్శకులు పి వాసు మరణించారని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయం చివరికి ఆయన వద్దకే చేరడంతో , వెంటనే ఆయన ఒక వీడియో ను విడుదల చేస్తూ నేను బ్రతికే వున్నానని, తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకోవలసి వచ్చింది . ఉదయం ఆరు కిలోమీటర్లు వాకింగ్ చేసి ఇంటికి వచ్చిన తనకు వాట్సాప్ ద్వారా వచ్చిన ఒక మెసేజ్ చూశానని, అందులో తాను మరణించినట్లు గా ఉందని , అయితే అది చూసి నవ్వుకున్నానని, ప్రజలకు తనపై ఇంత అభిమానం ఉన్నందుకు సంతోషించానని , అయితే నేను బ్రతికే వున్నానని త్వరలోనే ఈ సంవత్సరంలో మూడు చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నానని ఆయన ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఆయన పలుచిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ హీరోగా నటించిన మహారథి, సూపర్ స్టార్ రజినికాంత్ సూపర్ హిట్ చంద్రముఖి ఆయన దర్శకత్వం వహించినవే ….