అటువంటి వారిపై లీగల్ గా వెళ్తా…శ్రీరెడ్డికి అవకాశం ఇస్తా : జీవిత రాజశేఖర్

Tuesday, April 17th, 2018, 07:56:40 PM IST


ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో ఒక మహిళా సామజిక కార్యకర్త తమ కుటుంబం పై లేని పోనీ అసత్య ఆరోపణలు చేసిందని, టివి ఛానల్ లో ఉన్నామని నోటికి ఏదివస్తే అది మాట్లాడతారా అని నేడు తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మీడియాలో తన కుటుంబంపై వస్తున్న వార్తలను ఖండించారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై లీగల్‌గానే వెళతానన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి విషయంపై స్పందించిన జీవిత, తమ సినిమాల్లో ఆమెకు ఖచ్చితంగా అవకాశం ఇస్తా అన్నారు.

ఆమె కొన్ని పాత్రలకు సూట్ అవుతుందని, అవకాశంవుంటే ఆమె సరిపోయే పాత్రకు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే సినీ పరిశ్రమపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇండస్ట్రీ అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. అన్ని రంగాల్లో ఉన్నట్టే దళారీ వ్యవస్థ ఇక్కడకూడా ఉందన్నారు. ఇష్టం వచ్చినట్టు మైకుల ముందు మాట్లాడితే ఊరుకొనేది లేదని ఈ విధంగా టాలీవుడ్ పరిశ్రమలోని వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే అటువంటివారికి బుద్ధి చెపుతారని, తాను ఈ విషయమై ఒంటరిగా ఎక్కడిదాకా అయినా వెళ్ళడానికి సిద్ధమని ఆమె అన్నారు…..