ఎన్టీఆర్, జయలలిత సినిమాలు తీసితీరతానంటున్న నిర్మాత ?

Saturday, December 2nd, 2017, 12:52:52 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ గా లక్ష్మిస్ వీరగ్రంధం సినిమాను మొదలు పెట్టిన కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి .. సినిమా ప్రకటించి మొదటి రోజు షూటింగ్ కానీ ఎన్టీఆర్ సొంత ఊరులో ప్లాన్ చేసాడు .. కానీ అక్కడి జనం షూటింగ్ చేయొద్దంటూ అడ్డు నిలవడంతో ప్రయత్నం విరమించుకున్న కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి … వెంటనే .. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆమె సన్నిహితురాలు .. శశి కళల జీవితాలపై శశి లలితా పేరుతొ సినిమా తీస్తానని సన్నాహాలు మొదలు పెట్టాడు .. ఈ సినిమా అనుకునేలోగా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక ఎన్టీఆర్ లక్ష్మిస్ వీరగ్రంధం విషయంలో లక్ష్మి పార్వతి వివాదాలను రేపుతుందని, ఇందులో లక్ష్మి పార్వతి జీవితం కూడా ఏంతో గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపాడు. ఇండియాలో ఎంతోమంది మహా వ్యక్తుల జీవిత కథలు తెరపైకి వస్తున్నాయి .. అలాంటిది మహా నటుడు అన్నగారి జీవితం పై ఎందుకు సినిమా తీయకూడదని అంటున్నారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథలను తీసి తీరుతానని పట్టు పట్టాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ సినిమాలు అగవని చెబుతున్నాడు కేతిరెడ్డి.

  •  
  •  
  •  
  •  

Comments