మోడీని ఎదుర్కొనే ప్లాన్ నా దగ్గర ఉంది అంటున్న పాక్ మాజీక్రికెటర్

Friday, September 30th, 2016, 03:08:19 PM IST

imran-khan
భారత్ చేసిన మెరుపు దాడి – సర్జికల్ స్త్రిక్స్ తో పాకిస్తాన్ విలవిల లాడుతోంది. ఆ దేశ ప్రధాని స్వయంగా దాడులు జరిగాయి అని ఒప్పుకుంటున్నా ఆర్మీ మాత్రం అలాంటిది ఏదీ తమ భూభాగంలో జరగలేదు అంటోంది. అయితే భారత్ చేసిన ఈ దాడుల విషయం లో ప్రధాని నవాజ్ షరీఫ్ సరిగ్గా స్పందించడం లేదు అనే ఫీలింగ్ ప్రతీ పాకిస్తానీ మనస్సులో ఉంది. ఈ విషయం లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ , పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. ఇలాంటి దాడులు జరుగుతున్న క్రమం లో స్పందించాల్సిన తీరులో షరీఫ్ స్పందించడం లేదు అనీ ఇలాంటి ప్రోగ్రాం ని చాలా పరిణితి తో హ్యాండిల్ చెయ్యాలి అనీ అంటున్నారు ఆయన. ఇవాళ పంజాబ్ ప్రావిన్స్‌లో నిర్వహించనున్న మార్చ్‌లో ఆ విషయాన్ని చెబుతానని ఆయన పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్‌కు ప్రాథమికంగా ఓ సందేశం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పిన ఇమ్రాన్ భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా శుక్రవారం ఓ సందేశం పంపిస్తానన్నారు. తాను నిర్వహించబోయే మార్చ్ లో ప్రజలు అందరూ పాల్గొనే ఐక్యత చూపించాలి అని ఇమ్రాన్ కోరుతున్నారు. మరొక వైపు షరీఫ్ మీద సీరియస్ ఐన ఇమ్రాన్ ఆయనకి దేశాన్ని పాలించడం చేతకాదు అని ఎద్దేవా చేసారు.