అజ్ఞాతవాసి చూసి భయపడ్డానంటున్న వర్మ

Thursday, January 11th, 2018, 12:08:27 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి నిన్న ప్రపంచవ్యాప్తం గా విడుదలయి ప్రేక్షకులను అలరిస్తోంది. మూవీ పై వస్తున్న మిక్స్డ్ టాక్ ను పక్కన పెడితే, ఈ సినిమా పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపం లో తెలియచేసారు. ఈ సినిమా చూస్తుంటే పవన్ కెరీర్లో అత్యంత చెత్త సినిమాగా నిలిచిన ‘పులి’ సినిమాను చూసినట్లు ఉందని, కోరలు, పంజా లేని ఇటువంటి పులిని తాను ఇప్పటివరకు చూడలేదని వ్యంగ్యంగా పేర్కొన్నారు. చారలు లేని పులిని కూడా తాను ఇప్పటివరకు చూడలేదన్న వర్మ, దూకవలసిన పులి పాకడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన విమర్శించారు. ఏది ఏమైనా ఎప్పుడూ ఏదో ఒక అంశం పై తన వ్యాఖ్యలతో వివాదాలలో లో నిలిచే వర్మ అజ్ఞాతవాసి పై చేసిన ట్వీట్స్ కి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి…