ఆయనని ఇలా చూస్తుంటే బాధగా ఉంది: హీరో సుమంత్

Monday, April 9th, 2018, 06:29:26 PM IST

ఏపీకి ప్రత్యేక హోదా, అలానే విభజన హామీల సాధన విషయమై కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం అన్యాయం చేసిందని గత కొద్దిరోజులుగా ఏపీలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి, అలానే జనసేన, వామపక్షాలు సహా ప్రతిఒక్క పార్టీ ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం హస్తినలో ఈ నిరసన తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మొన్నటివరకు పార్లమెంట్ లో ధర్నా చేపట్టిన టిడిపి ఎంపీలు ఇప్పుడు ఏకంగా ప్రధాని నివాసమే లక్ష్యంగా ముందుకు సాగరు. అయితే మోదీ హయాంలో ఇప్పటి వరకూ ఏ పార్టీ ఎంపీలూ చేయని రీతిలో ఆయన ఇంటి ముందే ఆదివారం మెరుపు ధర్నాకు దిగారు.

నవ్యాంధ్రకు న్యాయం చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాలై వారు నినదించారు. వారి నిరసన జరుగుతుండగా ఎంపీలు అని కూడా చూడకుండా వారిని బలవంతంగా లాగిపడేశారు అక్కడి సిబ్బంది. ఇలాంటి చర్యకు గురైన వారిలో ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు. అలా జయదేవ్‌‌కు జరగడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందంటూ టాలీవుడ్ హీరో సుమంత్ పోస్ట్ పెట్టారు. ‘నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్‌కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అని సుమంత్, గల్లా జయదేవ్ పెట్టిన పోస్ట్, పిక్స్‌పై ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments