“ఇతన్ని ప్రేమిస్తున్నా” అంటున్న నమ్రత శిరోద్కర్

Thursday, April 5th, 2018, 05:07:12 PM IST

ఆ! న్యూస్ చూసి కంగారు పడకండి. వంశి సినిమాతో టాలీవుడ్ కె కాదు మన సూపర్ స్టార్ మదిలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన నటి నమ్రత శిరోద్కర్ ఆ తర్వాత తెలుగు లో మెగాస్టార్ సరసన అంజి సినిమాలో మెరిశారు. అయితే తరువాత కొద్దిరోజులకి మన సూపర్ స్టార్ కి సతీమణిగా మారిపోయారు నమ్రత. అప్పటినుండి ఇప్పటివరకు ఆమె ఎంత సూపర్ స్టార్ భార్య అయినప్పటికీ ఏమాత్రం బింకం, అహం ప్రదర్శించరని పలువురు టాలీవుడ్ ప్రముఖులు చెప్పడం చూసాం. అంతే కాదు ఇటీవల ఆమె సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫామిలీ కి సంబందించిన న్యూస్ పోస్ట్ చేస్తున్నారు.

అందులో భాగంగా మొన్న ఆమె ‘ఇతన్ని ప్రేమిస్తున్నా’ అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫోటో పెట్టారు. అలా పెట్టారో లేదో ఈ పోస్ట్ వైరల్ అయి నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఇంతకీ నమ్రత ప్రేమించేది ఎవరిని అనే డౌట్ వస్తోంది కదూ. ఇంకెవరిని చెప్పండి, తన భర్త ప్రిన్స్ చార్మింగ్ మహేష్ బాబునే. పెళ్లి జరిగినప్పటినుండి, ఎంతో అన్యూన్యంగా సాగిపోతున్న ఈ దంపతులకు కొడుకు గౌతమ్, కూతురు సితార జన్మించారు. తాజాగా మహేష్ ఫోటోను షేర్ చేసి ‘ఇతన్ని ప్రేమిస్తున్నా’ అంటూ మరోసారి మహేష్‌పై తనకున్న యెనలేని ప్రేమను చాటిచెప్పారు. ఎంతో అట్రాక్టివ్‌గా ఉన్న మహేష్ ఫోటో చూసి ‘మేము కూడా ప్రేమిస్తున్నాం’ అని కొందరు కామెంట్స్ పెట్టగా, ‘నమ్రత మీరు నిజంగా చాలా అదృష్టవంతురాలు’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments