ఆ బయోపిక్ లో నేను నటించడం లేదు : కళ్యాణ్ రామ్

Sunday, June 10th, 2018, 01:09:43 PM IST

యువ నటుడు కల్యాణ రామ్ నూతన చిత్రం ‘నా నువ్వే’ ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మీడియాతో నేడు కాసేపు ముచ్చటించారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, దర్శకుడు మొదట కథ చెప్పినపుడు నేను అసలు ఈ కథకు సూట్ కానని అనుకున్నానని, అయితే ఇటువంటి విభిన్నమైన రోల్ తో తనలోని సరికొత్త యాంగిల్ ని తెరపై ఆవిష్కరించవచ్చని దర్శకుడు ఒప్పించడంతో చివరికి నటించడానికి ఒప్పుకున్నానని కళ్యాణ్ రామ్ అన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే, మీరు ఎన్టీఆర్ బయోపిక్ లో మీ తండ్రి హరికృష్ణ గారి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారట నిజమేనా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ జవాబిస్తూ,

తొలుత ఆ చిత్రానికి తేజని దర్శకులుగా అనుకున్నపుడు అయన తనవద్దకు వచ్చి ఎన్టీఆర్ చిత్రంలో ఒక పాత్ర చేయమని అడిగారని, అయితే అది ఏ పాత్ర అని మాత్రం తనకు చెప్పలేదని అన్నారు. ఇక ప్రస్తుతం ఆ చిత్రానికి తేజ స్థానంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండడంతో ఆ టీం నుండి ఇప్పటివరకు తనను నటించమని ఎవరు అడగలేదని అన్నారు. కాగా తాను ఆ బయోపిక్ లో నటించడంలేదని చెప్పారు. అయన చెప్పన ఈ సమాధానంతో ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ నటించకకపోవడం దాదాపుగా నిజమేనని తేలిపోయినట్లయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments